
శతమానం భవతి చిత్రంతో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరుతెచ్చుకున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. అయితే ఈ చిత్రం తరువాత గత ఏడాది నితిన్ తో శ్రీనివాస కళ్యాణం అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో కొంచం గ్యాప్ తీసుకుని తన కొత్త చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు ఈ డైరెక్టర్.
ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మాణంలో సతీష్ తన కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈచిత్రానికి ‘అల్ ఈజ్ వెల్’ అనే టైటిల్ ను ఖరారు చేయనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.