అజిత్ సినిమాకి తెలుగులో ఇంట్రెస్టింగ్ టైటిల్.?

Published on Dec 6, 2022 11:10 am IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా మంజు వారియర్ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ చిత్రం “తునివు” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ కాగా ఈ చిత్రం భారీ అంచనాలు అయితే ఈ సినిమా నెలకొల్పుకుంది. ఇక ఈ అవైటెడ్ సినిమా తమిళ నాట భారీ రిలీజ్ కానుండగా తెలుగులో కూడా మేకర్స్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక తెలుగులో అజిత్ కూడా నెమ్మదిగా తన మార్కెట్ ని విస్తరిస్తున్నారు. మరి తెలుగులో అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ “తెగింపు” అనే టైటిల్ తో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో అజిత్ “వలిమై” చిత్రంని తెలుగులో “బలం” అనే టైటిల్ తో అనౌన్స్ చేశారు. కానీ తెలుగులో మళ్ళీ వలిమై పేరిటే రిలీజ్ చేశారు. ఇక తునివు విషయంలో ఏమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :