టాక్..”చరణ్ 15″ కి ఇంట్రెస్టింగ్ టైటిల్.!

Published on Mar 8, 2023 1:00 pm IST

గ్లోబల్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మావెరిక్ దర్శకుడు శంకర్ కలయికలో తమ ఇద్దరి కెరీర్ లో కూడా 15వ సినిమాగా ఈ భారీ సినిమా చిత్రం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి చాలా మేర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని శంకర్ మళ్ళీ తన హిట్ ట్రాక్ సాలిడ్ పొలిటికల్ థ్రిల్లర్ జానర్ లో ప్లాన్ చేశారు. మరి ఈ సినిమాకి సంబంధించి గత కొన్నాళ్లుగా టైటిల్ సహా ఫస్ట్ లుక్ పై ఆసక్తి నెలకొంది.

మరి పలు టైటిల్స్ ఆల్రెడీ పరిశీలనలో ఉన్నట్టుగా బజ్ రాగ ఇప్పుడు అయితే ఈ సెన్సేషనల్ కాంబినేషన్ కి గాను ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈసారి అయితే “సి ఈ ఓ” టైటిల్ ని మేకర్స్ లాక్ చేశారట. దీనితో ఇది వైరల్ గా మారింది. ఇక దీనిపై అయితే ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వహించారు.

సంబంధిత సమాచారం :