మోహన్ లాల్ – షారుఖ్ ఖాన్ మధ్య ఇంట్రెస్టింగ్ ట్వీట్స్

మోలీవుడ్ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస సినిమాలతో కొనసాగుతున్నారు. ఇక తాజాగా ఒక ఈవెంట్ లో భాగంగా షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీలోని జిందా బందా సాంగ్ కి డ్యాన్స్ అదరగొట్టారు మోహన్ లాల్. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దాని పై స్పందించిన షారుఖ్, మీరు డ్యాన్స్ అదరగొట్టారు మోహన్ లాల్ సార్ సూపర్ అంటూ ట్వీట్ చేసారు.

అయితే ఆ సాంగ్ కి మీకంటే ఎవరూ బాగా డ్యాన్స్ చేయలేరు, మీరు బెస్ట్ అంటూ రిప్లై ఇచ్చారు మోహన్ లాల్. అలానే జిందా బందా బ్రేక్ ఫాస్ట్ చేద్దామా అంటూ మోహన్ లాల్ చేసిన పోస్ట్ కు అలాగే సార్, ప్లేస్ మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అంటూ షారుఖ్ స్వీట్ రిప్లై ఇచ్చారు. మొత్తంగా ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోల ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version