మహేష్ సినిమా టైటిల్‌ అలాగే ఉండాలట..!

1st, December 2016 - 01:07:03 PM

mahesh
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులే కాక ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇద్దరు సౌతిండియన్ లెవెల్ స్టార్స్ కలిసిచేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ ఏమై ఉంటుందన్న దానిపై మొదట్నుంచీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. దీపావళికి టైటిల్ విడుదలవుతుందని వినిపించినా, అప్పుడు కూడా అభిమానులకు నిరాశ తప్పలేదు.

ఇక మురుగదాస్ ఇప్పటికి కూడా ఒక టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. తాజాగా టైటిల్ విషయమై మురుగదాస్ టీమ్ నుంచి ఒక సమాచారం అందింది. టైటిల్‌కు శివ అనే పేరుతో ఓ కనెక్షన్ ఉంటుందట. మురుగదాస్ ఈ విషయాన్ని పక్కాగా కోరుకోవడం వల్లే శివ‌తో కనెక్షన్ ఉండే పేరునే పరిశీలిస్తున్నారట. త్వరలోనే ఒక టైటిల్‌ను ఫిక్స్ చేసేసి జనవరి నెలలో ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని మురుగదాస్ భావిస్తున్నారట. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తుండగా, రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.