‘సూపర్ స్టార్’కి సెక్యూరిటీని నియమించిన ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం !

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న అతికొద్ది మంది ఇండియన్ హీరోల్లో ఆయన మొదటి వరుసలో నిలుస్తారు. నిజానికి గత కొంత కాలంగా రజినీ సినిమాలు సరిగ్గా ఆడట్లేదు. అయినప్పటికీ రజినీకాంత్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకి పెరుగుతూనే వస్తోంది.

కాగా కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న తన 165వ సినిమా టైటిల్‌ను ‘పేటా’ అని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ, వారణాశిలో ఈ చిత్రం నెల రోజు పాటు షూటింగ్ జరుపుకోబోతుంది. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సూపర్ స్టార్ కి 25 మంది పోలీసులను సెక్యూరిటీగా నియమించడం విశేషం.

ఇక ఈ చిత్రంలో రజని సరసన సీనియర్ హిరోయిన్ సిమ్రాన్ నటిస్తుండగా.. ఇతర కీలక పాత్రల్లో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో రజని సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. యువ సంగీత సంచలనం అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Advertising
Advertising