“రాధే శ్యామ్” నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ డేట్ కి?

Published on Nov 20, 2021 7:03 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “రాధే శ్యామ్”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతున్న సందర్భంగా మేకర్స్ ఇక వరుస అప్డేట్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు.

అలా రీసెంట్ గా సినిమా మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఫస్ట్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దానికి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు ఇంకో కీలక అప్డేట్ కి సమయం దగ్గర పడుతుందట. అది కూడా సినిమాలోని రెండో సాంగ్ కోసం అన్నట్టు టాక్. మరి ఇది కూడా ఈ వచ్చే నవెంబర్ 23 న రాబోతుందట. దీనిపై అప్డేట్ ని ఈ రోజుకి ఫిక్స్ చేసినట్లుగా బజ్. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :