“ఆదిత్య 369” సీక్వెల్ పై బాలయ్య నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

“ఆదిత్య 369” సీక్వెల్ పై బాలయ్య నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Nov 8, 2022 11:09 AM IST

మన టాలీవుడ్ స్టార్ హీరోస్ లో నందమూరి నటసింహం బాలయ్య సినిమా ఫలితం ఎలా ఉన్నా ఎక్కువ ప్రయోగాలు అయితే చేయడానికి ఇష్టపడతారు. మరి అలా తాను చేసిన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో తన కెరీర్ భారీ హిట్స్ లో ఒకటైన టైం ట్రావెల్ చిత్రం “ఆదిత్య 369” కూడా ఒకటి. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఓ ట్రెండ్ ని సెట్ చెయ్యగా ఇప్పటికీ కూడా అంతే థ్రిల్ ని అందిస్తుంది.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ అనే అంశం కూడా ఎప్పుడు నుంచో ఊరిస్తూ వస్తుంది. మరి దీనిని అయితే స్వయంగా బాలయ్యే తెరకెక్కించనుండగా లేటెస్ట్ గా అయితే బాలయ్య సీక్వెల్ పై కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి తాను “ఆదిత్య 999 మ్యాక్స్” అనే టైటిల్ పెట్టానని ప్రస్తుతం అయితే స్క్రిప్ట్ వర్క్ లో తాను ఉన్నానని తన టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ అప్డేట్ ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు