లేటెస్ట్..చరణ్, శంకర్ ల భారీ ప్రాజెక్ట్ ఈ డేట్ నుంచి స్టార్ట్.?

Published on Oct 9, 2021 2:00 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఐకానిక్ దర్శకుడు శంకర్ కాంబోలో భారీ సినిమాని ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా గ్రాండ్ గా కూడా ముహూర్తం స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఈ ఆక్టోబర్ నెల నుంచి షూట్ షురూ చేసుకోనుంది అని ఎప్పుడు నుంచో బజ్ ఉంది. అయితే ఈ షూట్ పై ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకి వచ్చింది.

దాని ప్రకారం పూణే లో ప్లాన్ చేసిన ఈ ఫస్ట్ షెడ్యూల్ ని మేకర్స్ వచ్చే ఆక్టోబర్ 21 నుంచి స్టార్ట్ చెయ్యనున్నారట. అక్కడ నుంచి ఫుల్ స్వింగ్ లో ఈ సినిమా షూటింగ్ ఉండబోతున్నట్టు సమాచారం. ఇక ఈ భారీ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దిల్ రాజు తమ బ్యానర్ లో ఈ చిత్రాన్ని 50వ ప్రాజెక్ట్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :