“ఆదిపురుష్” టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

“ఆదిపురుష్” టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Published on Oct 2, 2022 12:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ పై అనేక అంచనాలు నెలకొనగా ఈరోజు అయితే మేకర్స్ ఈ చిత్రం నుంచి అవైటెడ్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ టీజర్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.

మరి ఇప్పుడు ఈ టీజర్ పై ఇంట్రెస్టింగ్ బజ్ అయితే తెలుస్తుంది. ఈ టీజర్ లో అద్భుతమైన విజువల్స్ తో పాటుగా రాముని గెటప్ లో ప్రభాస్ నుంచి డైలాగ్స్ కూడా ఉంటాయట. అలాగే హిందీ వెర్షన్ లో అయితే ముందు నుంచి వస్తున్న వార్తల ప్రకారమే శరద్ కేల్కర్ తోనే డబ్బింగ్ ఉంటుంది అని తెలుస్తుంది. మొత్తానికి అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి గట్టి ట్రీటే ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు