ప్రభాస్ ‘ఆదిపురుష్’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ?

ప్రభాస్ ‘ఆదిపురుష్’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ?

Published on Nov 27, 2022 11:05 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం భారీ అంచనాల మధ్య భారీగా తెరకెక్కుతుంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా రాబోతుంది. అయితే, ఈ సినిమా కోసం ప్రభాస్‌ చాలా సవాళ్లను ఫేస్‌ చేశాడు. రాముడి పాత్రలో కనిపించడానికి ప్రభాస్‌ చాలా రకాలుగా కష్టపడ్డారు. ముఖ్యంగా విలువిద్యలో ప్రభాస్‌ శిక్షణ కూడా తీసుకున్నారు.

పైగా విలుకారుల దేహదారుఢ్యం ‘వి’ షేప్ లో ఉంటారు. అంటే భుజాలు విశాలంగా, నడుము భాగానికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో కృతీ సనన్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్, అదే విధంగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు