బాలయ్య ‘అఖండ 2’ కథ ఇదే ?

Published on May 1, 2023 8:00 am IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. అఖండ లో శివుడ్ని, శివ భక్తితో పాటు బాలయ్య నట విశ్వరూపాన్ని చూపించి అఖండ విజయాన్ని నమోదు చేశాడు. అందుకే, ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, కొన్ని నెలల క్రితం, ‘అఖండ 2’ కచ్చితంగా ఉంటుందని బాలయ్య ప్రకటించాడు. ఈ క్రమంలో ఈ సినిమా కథ పై ఓ ఆసక్తికరమైన గాసిప్ వినిపిస్తోంది. ఓ స్వార్థ పరుడి చేతిలో పడి నాశనం అవుతున్న ప్రజలను, ముఖ్యంగా తిరుమలేశుని ప్రతిష్టను తగ్గించే కార్యక్రమాలు చేసే వ్యక్తులను హీరో అంతం చేస్తాడు.

అలాగే ఇతర మతస్తుడు నాయకుడు కావడం కారణంగా దేవాలయాల పై ఎలాంటి దాడులు జరుగుతాయి?, వాటిని అరికట్టాలి అంటే.. ఏం చేయాలి? లాంటి అంశాలను కూడా అఖండ 2 లో చూపించబోతున్నారు. మొత్తానికి అఖండ 2 లో పొలిటికల్ అంశాలే మెయిన్ హైలైట్ గా ఉండబోతున్నాయి. ముఖ్యంగా బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. అఖండ సీక్వెల్ కావడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. దానికి తోడు జూన్ 10, 2023న బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ‘అఖండ 2’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :