మెగాస్టార్ నెక్స్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Jul 23, 2021 8:08 pm IST


ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే హై బడ్జెట్ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకొన్ని రోజుల్లో పూర్తి షూట్ ని కంప్లీట్ చేసుకోనున్న ఈ సినిమా అనంతరం మెగాస్టార్ రెండు సాలిడ్ రీమేక్స్ చేయనున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో మళయాళ బ్లాక్ బస్టర్ చిత్రం “లూసిఫెర్” రీమేక్ కూడా ఒకటి.

దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహించనుండగా దీనిపై లేటెస్ట్ సమాచారం తెలుస్తుంది. ఈ చిత్రంలో కూడా ఆచార్య తరహా భారీ టెంపుల్ సెట్స్ కనిపిస్తాయట అలాగే దానిపై పూజా కార్యక్రమాన్ని కూడా ఈ చిత్రం పూర్తి చేసుకుందట. ఇంకా ఆల్రెడీ ఈ సినిమా మ్యూజికల్ వర్క్స్ స్టార్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ఆచార్య పూర్తయిన వెంటనే చిరు ఈ రీమేక్ స్టార్ట్ చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :