‘హరిహర వీరమల్లు’ క్లైమాక్స్ కోసం కసరత్తులు !

‘హరిహర వీరమల్లు’ క్లైమాక్స్ కోసం కసరత్తులు !

Published on Nov 21, 2022 7:57 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. అయితే, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. కాగా బుధవారం నుంచి పవన్ పై క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు క్లైమాక్స్ లో పాల్గొనే ఫైటర్స్ తో వర్క్ షాప్ జరుగుతుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ను క్రిష్ భారీగా ప్లాన్ చేస్తున్నాడట.

కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు