“ఇండియన్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

“ఇండియన్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Dec 14, 2022 8:21 PM IST


యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఇది ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ కాగా మధ్యలో కొన్ని సమస్యలు మూలాన కొన్నాళ్ళు ఆగి ఇప్పుడు మళ్ళీ అయితే షూట్ ని శరవేగంగా కంప్లీట్ చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.

ఈ చిత్రంలో మరోసారి కమల్ హాసన్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారట. అయితే ఈసారి ప్రీక్వెల్ లో తండ్రి కొడుకులు పాత్రల్లో కమల్ కనిపించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ రెండు పాత్రల్లో అయితే కమల్ ఎలా ఉండనున్నారో చూడాలి. ఇక ఈ చిత్రంలో అయితే కాజల్ అగర్వాల్ అలాగే రకుల్ ప్రీత్ సింగ్ లు కనిపించనుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రంని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు