“భారతీయుడు 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

“భారతీయుడు 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Nov 25, 2022 10:00 PM IST


లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “భారతీయుడు 2” కోసం అందరికీ తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఎన్నో ఏళ్ల తర్వాత కమల్ చేస్తున్న సినిమా ఇది కావడం పైగా భారతీయుడు లాంటి భారీ హిట్ కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో పాన్ ఇండియా లెవెల్లో అనేక అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎప్పుడో కంప్లీట్ కావాల్సి ఉన్న ఈ చిత్రం పలు కారణాలతో ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై అయితే లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. దాని ప్రకారం అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చ్ నాటికి షూటింగ్ అంతా కంప్లీట్ చేసేయాలని ఫిక్స్ అయ్యారట. అలాగే ఓ పండుగ డేట్ కి సినిమాని రిలీజ్ చెయ్యాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. దీనితో ఈ భారీ చిత్రం ఓ ఫెస్టివల్ రిలీజ్ కి అయితే రెడీ అవుతుందని చెప్పాలి. మరి ఈ సినిమాకి అయితే అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు