“కేజీయఫ్ 3” పై వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Jun 24, 2022 7:03 am IST


కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. దీనికి ముందు చాప్టర్ 1 భారీ హిట్ తో దీనిపై ఎనలేని హైప్ నెలకొనగా దానికి మించే ఈ చిత్రం కూడా సాలిడ్ వసూళ్లను ఏఈ చిత్రం కొల్లగొట్టింది. ఇక దీని తర్వాత ఈ సినిమాకి కూడా కొనసాగింపుగా “కేజీయఫ్ చాప్టర్ 3” ఉందని హింట్ ఇవ్వగా దీనిపై మరింత హైప్ నెలకొంది.

అలాగే తర్వాత ఈ సినిమా షూటింగ్ పై కూడా క్లారిటీ అంటూ పలు వార్తలు రాగా అవి మరింత స్థాయిలో వైరల్ అయ్యాయి. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా అయితే నీల్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. చాప్టర్ 3 డెఫినెట్ గా ఉంటుందని కాకపోతే ఇప్పుడప్పుడే ఉండదని, కాస్ట్ గ్యాప్ తీసుకున్నాకే చాప్టర్ 3 తెరకెక్కించే ప్లాన్ లు ఉన్నాయని నీల్ క్లారిటీ ఇచ్చినట్టు టాక్. మరి ఇదెప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :