‘ఎన్టీఆర్’ సినిమా నుంచి ఆలియా భట్ అవుట్ ?

‘ఎన్టీఆర్’ సినిమా నుంచి ఆలియా భట్ అవుట్ ?

Published on Apr 13, 2022 3:02 AM IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నెలలో ఆలియా పెళ్లి చేసుకోబోతుంది. అందుకే.. ఆమె ‘ఎన్టీఆర్ – కొరటాల’ సినిమా నుంచి తప్పుకుందని తాజాగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి, ఈ రూమర్స్ లో ఎంత నిజం ఉందో చూడాలి. ఇక జూన్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ను స్టార్ట్ చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా.. సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్స్ ను తీస్తాడట. కాగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు