ఎన్టీఆర్ – కొరటాల సినిమాకు రంగం సిద్ధం !

Published on Jan 24, 2022 8:35 am IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులను స్పీడప్‌ చేశారు. పైగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ను స్టార్ట్ చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్, అలాగే సాంకేతిక నిపుణుల వివరాలను కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించాలని చిత్రబృందం భావిస్తోంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కాగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అన్నట్టు ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించారు, అయితే అది పోస్ట్ ఫోన్ కానుంది.

సంబంధిత సమాచారం :