మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా ఓ చిన్న విరామం అనంతరం రీస్టార్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ షూటింగ్ పై అయితే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని హైదరాబాద్ భూత్ బంగ్లాలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అలాగే క్లైమాక్స్ పోర్షన్ ని మేకర్స్ ఇక్కడ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రం నుంచి అయితే ఈ వినాయక చతుర్థి సందర్భంగా ఓ స్పెషల్ అప్డేట్ ని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా బజ్ ఉంది. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.