నితిన్ క్రేజీ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Jun 6, 2023 12:03 pm IST


మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా చేసిన చిత్రాల్లో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అండ్ క్రేజీ కం బ్యాక్ అయ్యినటువంటి “భీష్మ” కోసం తెలిసిందే. దర్శకుడు వెంకీ కుడుముల యంగ్ హీరోయిన్ రష్మికా మందన్నా కాంబినేషన్ లో అయితే వచ్చిన ఈ చిత్రం తమ కాంబినేషన్ పై సాలిడ్ హైప్ తీసుకొచ్చింది. ఇక ఈ చిత్రం తర్వాత మరోసారి వీరి నుంచి క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ కాగా దీనిపై మంచి అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి.

ఇక ఇదిలా ఉండగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ప్రస్తుతం మేకర్స్ అయితే సంగీత దర్శకుడు జివి ప్రకాష్ తో ఓ సెన్సేషనల్ ఆల్బమ్ అయితే అందిస్తునట్టుగా తెలిపారు. ప్రస్తుతం జివి ప్రకాష్ అలాగే సాహిత్య రచయిత కాసర్ల శ్యామ్ అయితే కలిసి మ్యూజికల్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నారు. మరి ప్రస్తుతం జివి ప్రకాష్ ఇస్తున్న అన్ని ఆల్బమ్స్ కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయి మరి ఈ చిత్రానికి ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :