“ఎన్టీఆర్ 30” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Nov 24, 2022 3:34 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు కొరటాల శివతో ఈ చిత్రం ఎన్టీఆర్ చేయనుండగా వీరి కాంబో నుంచి రెండో సినిమా ఇది కావడం పైగా ఎన్టీఆర్ కి RRR లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తుండడంతో ఈ చిత్రంపై తారా స్థాయి హైప్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ ఇప్పుడిప్పుడే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూ ఉండగా ఇప్పుడు ఓ క్రేజీ బజ్ అయితే దీనిపై వినిపిస్తుంది.

ఈ చిత్రం నీటి నేపథ్యంలో ప్లాన్ చేసినట్టు తెలిసిందే. మరి ఇందులో భారీ యాక్షన్ లు అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ప్లాన్ చేస్తుండగా వీటికి సంబంధించి అయితే మేకర్స్ ఇప్పుడు సరైన లొకేషన్స్ వేటలో ఉన్నారట. మరి ఇవి ఫైనలైజ్ అయ్యిన వెంటనే ప్లాన్ ప్రకారం షెడ్యూల్స్ స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ భారీ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ మరియు యువ సుధా బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :