పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ కుదిరేసింది !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో రూపొందిన గత సినిమాలన్నీ మంచి హిట్లు కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీస్థాయి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే త్రివిక్రమ్ కూడా సినిమాను అన్ని హంగులతో చాలా పకడ్బంధీగా రూపొందిస్తున్నారు. ఇకపోతే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండవ షెడ్యూల్లో ఉన్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి బయటికొచ్చింది.

అదేమిటంటే ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ లాంచ్, విడుదల తేదీలను నిర్ణయించేశారట. త్వరలో వాటిని అనౌన్స్ కూడా చేస్తారట. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ లో పవన్ సరసన అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.