సలార్ క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

Published on May 30, 2022 9:00 am IST

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ క్రేజ్ ప్రాజెక్ట్స్ లో ‘సలార్’ ఒకటి. పైగా పవర్ ఫుల్ యాక్షన్ చిత్రం ఇది. అందుకే, ‘సలార్’ సినిమా పై నేషనల్ రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా క్లైమాక్స్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. క్లైమాక్స్ మొత్తం సముద్రంలో జరుగుతుంది అని.. ముఖ్యంగా సముద్రం లోపల చేసే ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. పైగా కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇది.

అందుకే అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడానికి మేకర్స్ కూడా భారీగా కసరత్తులు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఆమెది ట్రాజెడీ క్యారెక్టర్ అని.. ప్రభాస్ – శృతి హాసన్ మధ్య ట్రాక్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. .

సంబంధిత సమాచారం :