“ది రాజా సాబ్” పై క్రేజీ అప్డేట్..!

“ది రాజా సాబ్” పై క్రేజీ అప్డేట్..!

Published on Oct 19, 2024 1:55 AM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతితో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. మరి దర్శకుడు మారుతీతో ప్రభాస్ మొదటి సారి ఈ సినిమా చేస్తుండగా ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ అంత హ్యాపీగా లేరు అని అందరికీ తెలిసిందే.

కానీ తర్వాత మాత్రం ఫ్యాన్స్ ని తమ వర్క్ తోనే మేకర్స్ తమ సినిమా వైపు తిప్పుకున్నారు. ఇలా ఇప్పుడు వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమా విషయంలో మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ సినిమా విషయంలో వినిపిస్తుంది. ప్రభాస్ ఈ సినిమా స్క్రిప్ట్ ని బలంగా నమ్ముతున్నడం మూలానే ఈ సినిమా ఓకే అయ్యిందట.

అలాగే మారుతీ కూడా ప్రభాస్ కోసం స్పెషల్ గా రెగ్యులర్ గా కాకుండా ఫ్రెష్ లైన్ ని సిద్ధం చేసుకుని ఎవరూ ఊహించని స్కేల్ లో సినిమాని ప్లాన్ చేసుకున్నాడట. ఖచ్చితంగా ఈ సినిమా ఫ్యాన్స్ సహా మూవీ లవర్స్ ని కూడా ఆశ్చర్యపరిచేలా ఉంటుందట. అందుకే చిత్ర యూనిట్ అంతా కూడా ఈ సినిమా విషయంలో నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు