ప్రభాస్ ద్విపాత్రాభినయం.. నిజమేనా ?

ప్రభాస్ ద్విపాత్రాభినయం.. నిజమేనా ?

Published on Dec 4, 2022 9:35 PM IST

ప్రభాస్ – మారుతి కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరో – విలన్ రెండూ ప్రభాసే అని.. అనగా ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. మొత్తానికి మారుతి, ప్రభాస్ కోసం అద్భుతమైన వైవిధ్యమైన కథను సిద్ధం చేశాడట.

ఏది ఏమైనా ప్రభాస్ – మారుతి కలయికలో సినిమా వస్తోంది అనేసరికి ఈ సినిమా పై ఆసక్తి రెట్టింపు అయింది. కమర్షియల్ డైరెక్టర్ గా మారుతకి మంచి పేరు ఉంది. పైగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో మొదటిసారి మారుతి ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్నాడు. మరి మారుతి ప్రభాస్ కోసం ఎలాంటి స్క్రిప్ట్ ను రెడీ చేశాడు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడ. ఇక ఈ సినిమాతో మారుతి రేంజ్ మారిపోయినట్టే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు