‘పుష్ప 2’లో గొప్ప థ్రిల్లింగ్ ట్విస్ట్ !

Published on Jan 30, 2023 8:03 am IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం, ‘పుష్ప 2’ పైనే బన్నీ – సుకుమార్ తమ ఫుల్ ఫోకస్ పెట్టారు. కాగా ‘పుష్ప 2’ పై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట వైరల్ అవుతుంది. పుష్ప 2 ఇంటర్వెల్ లో బన్నీ డాన్ లుక్ లో కనిపిస్తాడని.. రష్మిక పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఈ ట్విస్ట్, గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా నిలుస్తోందని.. పైగా ఈ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. ప్రముఖ నటీనటులు ఈ సీక్వెల్ లో కనిపించనున్నారు. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు.

సంబంధిత సమాచారం :