‘రోబో 2.0 ‘ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ !


సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘రోబో 2.0’. 2010లో రిలీజైన భారీ బ్లాక్ బస్టర్ ‘రోబో’ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో చాలా గ్రాండ్ గా నిర్మిస్తోంది. కొద్ది రోజుల క్రితమే మొదలైన ఈ చిత్రం యొక్క ఆఖరి షెడ్యూల్ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ ఆఖరి దశ షూట్లో రజనీకాంత్, అక్షయ్ కుమార్ ల పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది.

అందుకోసం అక్షయ్ ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే చిత్రం యొక్క టీజర్ ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసి చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు దర్శక నిర్మాతలు.