“చరణ్ 15″లో తన రోల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

“చరణ్ 15″లో తన రోల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Dec 24, 2022 9:00 AM IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం శంకర్ సహా చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతుండగా పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ కూడా దీనిపై ఉంది.

ఇక ఈ అవైటెడ్ సినిమా షూట్ అయితే రీసెంట్ గానే వైజాగ్ లో మళ్ళీ రీ స్టార్ట్ అయ్యింది. అయితే చరణ్ ఈ చిత్రంలో పలు భిన్నమైన షేడ్స్ లో శంకర్ మార్క్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే ఇందులో చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరి దీనిపై ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఇప్పుడు తెలుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో అయితే చరణ్ ఓ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని తెలుస్తుంది.

ఓ పార్టీ తన పాత్రపై ఉంటుంది అని ఇప్పుడు ఆ సభ తాలూకా సన్నివేశాలే తెరకెక్కిస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మొత్తానికి అయితే శంకర్ తో చరణ్ ఏదో కొత్తగానే ట్రై చేస్తున్నారు. మరి ఈ విశేషాలు మరింత తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు