“సలార్” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on May 28, 2023 6:45 pm IST


ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం “ఆదిపురుష్” ముందుగా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాల షూటింగ్ లలో కూడా ప్రభాస్ బిజీగా ఉన్నాడు. మరి ఈ భారీ సినిమాల్లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంపై అయితే మాస్ ఆడియెన్స్ లో నెక్స్ట్ లెవెల్ హైప్ ఉండగా ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.

ప్రస్తుతం అయితే ప్రభాస్ సలార్ షూట్ లో జాయిన్ కాగా తాను ఫైనల్ స్టేజ్ షూట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ షూట్ గాని కంప్లీట్ అయ్యేపోతే సలార్ చిత్రం సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యిపోయినట్టే అని తెలుస్తుంది.నిజానికి ఎప్పుడో కంప్లీట్ అయిపోవాల్సిన ఈ చిత్రం మొత్తానికి అయితే ఎంతో కాలం నుంచి అలా కొనసాగుతూ ఇప్పటికి పూర్తవుతుంది. ఇక ఈ భారీ చిత్రం టీజర్ కోసం ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :