శంకర్, చరణ్ ల భారీ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Sep 7, 2021 10:00 am IST


ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో మెగాపవర్ రామ్ చరణ్ మరియు ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ ల కాంబోలో తెరకెక్కనున్న భారీ చిత్రంపైనే హాట్ హాట్ టాపిక్ గా నడుస్తుంది. మరి ఇంకొన్ని రోజుల్లో అధికారికంగా స్టార్ట్ కానున్న ఈ చిత్రంకు సంబంధించి గత కొన్ని రోజులుగా పలు ఆసక్తికరమైన అంశాలే వినిపిస్తున్నాయి.

మరి వాటిలో ఈ సినిమా ముహూర్తం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుండగా పలువురు స్పెషల్ గెస్ట్ లు కూడా ఈ వేడుకలో మెరవనున్నారని కన్ఫర్మ్ అయ్యింది. మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా లుక్ కోసం చరణ్ మరియు హీరోయిన్ కియారా పై ఈరోజు టెస్ట్ షూట్ జరగనున్నట్టుగా సమాచారం.

అలాగే రేపు 8న ఈ చిత్రం అధికారంగా లాంచ్ కానుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :