‘తమిళ హీరో’ తెలుగు సినిమా పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on Jan 3, 2022 7:37 pm IST

జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో తమిళ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇది తమిళంలో పాటు తెలుగులోనూ రూపుదిద్దుకుంటోంది. తమిళ స్టార్ హీరోగా శివ కార్తికేయన్ విభిన్నమైన కథలను, పాత్రలను ఎంచుకుని సినిమాలు చేస్తూ ఉంటాడు. అందుకే ఇలాంటి వైవిధ్యమైన హీరో కాబట్టే.. శివ కార్తికేయన్ కి తెలుగులో కూడా ఫుల్ క్రేజ్ ఉంది.

కాగా ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే నిర్మాతలు భారీ పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. అనుదీప్ తో చేయబోతున్న ఈ సినిమా కోసం శివ‌కార్తికేయ‌న్ కి ఏకంగా రూ.31 కోట్ల పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. ఈ మధ్యే ఈ చిత్రం లాంఛ‌నంగా మొద‌లైంది. శివ కార్తికేయ‌న్ తెలుగులో న‌టిస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాను శాంతి టాకీస్ తో కలిసి సురేష్ బాబు, నారాయ‌ణ్ దాస్ నారంగ్‌ నిరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :