మహేష్ ఆ సినిమాని స్పీడ్ గా ఫినిష్ చేస్తాడట !

మహేష్ ఆ సినిమాని స్పీడ్ గా ఫినిష్ చేస్తాడట !

Published on Apr 4, 2022 11:17 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయింది. ఇక చాలా స్పీడ్ గా ఈ సినిమాని ఫినిష్ చేయాలని.. మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేస్తారట. ఈ సినిమా షూటింగ్ ను ఈ నెల లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది.

మొదట ఓ సాంగ్ తో షూట్ స్టార్ట్ చేస్తారట. జానీ మాస్టర్ కంపోజ్ చేయనున్న ఈ సాంగ్ కోసం ఓ ప్రత్యేక సెట్ ను కూడా నిర్మిస్తున్నారట. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు