రామ్ తో బోయపాటి అడ్వెంచర్ థ్రిల్లర్‌.. క్రేజీ అప్ డేట్ !

Published on Aug 2, 2022 1:30 am IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే. బోయపాటి ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడట. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాబరీ బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. మొత్తానికి బోయపాటి – రామ్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది.

పైగా ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. ఆల్ రెడీ అఖండ సినిమాతో బోయపాటి తన ఖాతాలో భారీ హిట్ ను వేసుకున్నాడు.

కాబట్టి .. బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. అన్నిటికీ మించి హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది. అందుకే.. రామ్ కూడా ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :