“ఉస్తాద్ భగత్ సింగ్” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on May 12, 2023 11:33 am IST

ఇపుడు సోషల్ మీడియా సహా సినీ వర్గాల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” హవా అయితే నడుస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి పవన్ ని నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేయడంతో ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అయితే దక్కింది. అయితే ఈ గ్లింప్స్ రిలీజ్ చేయక ముందు వరకు కూడా ఈ సినిమా విషయంలో గాని దర్శకుడు హరీష్ శంకర్ విషయంలో గాని ఇదొక రీమేక్ అని ఫ్యాన్స్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు.

కానీ ఈ గ్లింప్స్ చూసాక అసలు ఒరిజినల్ కి రీమేక్ సినిమానేనా అనేలా చేసాడు హరీష్. అయితే ఈ చిత్రం తేరి కి రీమేక్ అయినప్పటికీ కేవలం ఆ చిత్రంలో కొద్ది పాటి లైన్ గాని సీన్స్ గాని ఉస్తాద్ లో కలుస్తాయట. దీనితో దాదాపు 90 శాతం సినిమా అంతా కూడా కొత్త గానే ఉంటుంది అని హరీష్ ఆ రేంజ్ మార్పులు చేర్పులు ఈ సినిమాకి చేసారని మొత్తం మార్చేసి ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ స్టఫ్ తో అయితే సినిమాని రెడీ చేస్తున్నారని ఇపుడు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :