“వాథి” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన జివి ప్రకాష్.!

Published on Feb 21, 2023 12:00 pm IST

లేటెస్ట్ గా టాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమా దగ్గర సూపర్ హిట్ టాక్ సంతరించుకొని స్యూర్ షాట్ హిట్ గా నిలిచిన చిత్రం “వాథి”. తమిళ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు మరియు తమిళ్ లో ఏక కాలంలో తెరకెక్కింది.

మరి ఈ సినిమా ఒక్క కంటెంట్ పరంగా మాత్రమే కాకుండా జివి ప్రకాష్ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అయ్యింది. అలా ఈ సినిమాలో స్వయంగా ధనుష్ రాసిన సాంగ్ “వా వాథి” తమిళ్ మరియు తెలుగు లో కూడా పెద్ద చార్ట్ బస్టర్ అయ్యింది. ఇక ఈ సాంగ్ అయితే ఒరిజినల్ గా ఫీమేల్ వెర్షన్ ని రెండు భాషల్లో మేకర్స్ రిలీజ్ చేశారు.

మరి దీనికి మేల్ వెర్షన్ లో అయితే అందులోని ధనుష్ గొంతు నుంచి వినాలి అని చాలా మంది ఆసక్తి కనబరచగా ఫైనల్ గా సంగీత దర్శకుడు జివి ప్రకాష్ ఆ అప్డేట్ ని అందించాడు. అతి త్వరలోనే ఈ అవైటెడ్ సాంగ్ ని వినబోతున్నారని కన్ఫర్మ్ చేసాడు. దీనితో మ్యూజిక్ లవర్స్ మరియు ధనుష్ అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

సంబంధిత సమాచారం :