విజయ్ “వరిసు” షూటింగ్ అప్పటికి కంప్లీట్.?

Published on Oct 8, 2022 12:42 am IST


ఇళయ తలపతి విజయ్ జోసెఫ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటెర్టైనెర్ చిత్రం “వరిసు”. తమిళ్ మరియు తెలుగు భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ని అయితే కంప్లీట్ చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై అయితే షూటింగ్ కి సంబంధించి లేటెస్ట్ టాక్ తెలుస్తుంది.

వంశీ ఆల్రెడీ ఈ సినిమాకి చాలా వరకు కంప్లీట్ చేసేసాడట. మరి దీనితో అయితే ఈ చిత్రం ఈ అక్టోబర్ నెలాఖరుకి షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందట. అలాగే ఈ దీపావళికి కూడా ఫస్ట్ సింగిల్ ఉండొచ్చనే బజ్ ఉంది. మరి దీనిపై కూడా మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు అయితే ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :