వర్సిటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ తన కొత్త చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ తో నేడు రానున్నారు. తాను నటిస్తున్న 58వ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్ నేడు క్రిస్మస్ కానుకగా అభిమానులకు అందించనున్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం ప్రకటన చేయడం జరిగింది. నేడు సాయంత్రం 6గంటలకు చియాన్ విక్రమ్ 58వ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్ విడుదల కానుంది.
దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న విక్రమ్ మరి ఈ మూవీతో సరైన హిట్ కొడతారేమో చూడాలి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం, మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ పొన్నియన్ సెల్వం చిత్రాలలో కూడా విక్రమ్ హీరోగా నటిస్తున్నారు.
