విశ్వక్ సేన్ “ధమ్కీ” ఫస్ట్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్‌

విశ్వక్ సేన్ “ధమ్కీ” ఫస్ట్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్‌

Published on Nov 13, 2022 5:46 PM IST


ఓరి దేవుడా తర్వాత విశ్వక్ సేన్ తన నెక్స్ట్ మూవీ ధమ్కీ తో బిజిగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.

తాజా వార్త ఏమిటంటే, ధమ్కీ హిందీ వెర్షన్ కోసం మొదటి పాట ముంబైలోని YRF స్టూడియోస్‌లో రికార్డ్ చేయబడింది. నకాష్ అజీజ్ ఈ సాంగ్ కోసం వర్క్ చేసినట్లు తెలుస్తోంది. విశ్వక్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ ద్వారా అదే విషయాన్ని వెల్లడించారు. ఇది అతని మొదటి హిందీ పాట కావడంతో ఉత్సాహంగా ఉన్నాడు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ధమ్‌కీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు