‘2పాయింట్0’ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ !
Published on Oct 26, 2017 4:41 pm IST

దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘రోబో’ చిత్రం తెలుగు లో ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలుసు. తాజాగా ‘2పాయింట్0’ ఫై అంతకు మించి అంచనాలు ఉన్నాయనడంలో సందేహమే లేదు. రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ లు నటిస్తుండడం తో అందరి కళ్ళు ఈ సినిమాపై ఉన్నాయి. దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో శంకర్ ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం.

రేపు (శుక్రవారం)ఈ సినిమా ఆడియోను దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో వైభవంగా జరుపనున్నారు. రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నాడు. ఈ ఆడియో వీక్షించడానికి భారీ ఎత్తున వీక్షకులు వెళ్లబోతున్నారు. సినిమాలో మొత్తం మూడు పాటలు మాత్రమే ఉంటాయట. అందులో రెండు పాటలు ఆడియో వేడుకలో విడుదల చేసి మూడో పాటను రిలీజ్ కు ముందు విడుదలచేయబోతున్నారు.

 
Like us on Facebook