బాలయ్య ఫస్ట్ ఎవర్ షో పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.!

Published on Oct 24, 2021 11:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా ఎవరూ ఊహించని విధంగా ఫస్ట్ ఎవర్ ఓటిటి షోకి తాను హోస్ట్ గా చేస్తానని షాకింగ్ ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మన తెలుగు మొదటి స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో స్ట్రీమ్ కానున్న ఈ ఇంట్రెస్టింగ్ షోలో చాలానే విశేషాలు ఉన్నాయి. అయితే ఈ ఇంట్రెస్టింగ్ షో పై ఇప్పుడు మరో ఆసక్తికర అప్డేట్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అయితే ఈ షో లో బాలయ్య ఎంట్రీపై స్పెషల్ సాంగ్ కి గాను షూట్ జరగనుందట. అంతేకాకుండా ఈ స్పెషల్ సాంగ్ ని నటరాజ్ మాస్టర్ కంపోజ్ చేసినట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఇక ఈ స్పెషల్ సాంగ్ పై అంచనాలు పెరిగాయి. తొందరలోనే ఈ ప్రోమో అయితే బయటకి రానున్నట్టుగా బజ్ ఉంది. మరి దాని కోసం వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :

More