ఎన్టీఆర్ రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.!

Published on Nov 23, 2021 9:00 am IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కంప్లీట్ చేసి తన షో “ఎవరు మీలో కోటీశ్వరులు”లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ షో నుంచి కూడా చిన్న బ్రేక్ లో ఉండి తారక్ ఫామిలీతో కలిసి చిన్న వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. మరి వీటి తర్వాత ఎన్టీఆర్ తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ అలాగే కేజీయఫ్ ఫేమ్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ లతో రెండు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చెయ్యనున్నాడు.

మరి వీటిపైనే లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తున్నాయి. మొదటగా కొరటాలతో సినిమాని తారక్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలు పెట్టనుండగా తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ ని అక్టోబర్ లో అలా స్టార్ట్ చేయనున్నాడట. అంతే కాకుండా ఈ రెండు సినిమాలకి కూడా తారక్ రెండు సాలిడ్ గెటప్స్ ని ప్రిపేర్ చేయనున్నాడని కూడా టాక్ ఉంది. సో ఫైనల్ గా తారక్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ పై ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :