ఆమెతో ప్రభాస్ ట్రాక్ వెరీ ఎమోషనల్ !

Published on Nov 22, 2021 6:01 pm IST


నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వస్తున్న సినిమా ‘సలార్’. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ఆమెది ట్రాజెడీ క్యారెక్టర్ అని.. ప్రభాస్ – శృతి హాసన్ మధ్య ట్రాక్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే శృతి హాసన్ పాత్ర ప్రీ క్లైమాక్స్ లో చనిపోతుందట.

ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. కాగా ఆ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీనిధి శెట్టిని తీసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కనిపించబోతుందని తెలుస్తోంది. ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :

More