లేటెస్ట్..”రాధే శ్యామ్” పై ఆసక్తికర అప్డేట్స్..!

Published on Nov 17, 2021 7:18 pm IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్”. భారీ స్థాయి అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ క్రమంలోనే రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ మరియు ఫస్ట్ సాంగ్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ హిందీ వెర్షన్ కి సంబంధించి డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసాడట. అలాగే సినిమా నుంచి హిందీ సింగిల్ పై కూడా ఇంట్రెస్టింగ్ టాక్ అనుకోవచ్చు. సౌత్ ఆల్బమ్ కి సంబంధించి ఒక వెర్షన్ సాంగ్ ని డిజైన్ చెయ్యగా హిందీకి మాత్రం వేరే వెర్షన్ ని రెడీ చేస్తున్నారు కావచ్చు అందుకే అది మరింత లేట్ అవుతుందని టాక్. దీనిని కూడా మేకర్స్ తొందరలోనే రిలీజ్ చెయ్యనున్నారట.

సంబంధిత సమాచారం :

More