బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని అట్లీ తెరకెక్కించగా అనిరుద్ సంగీతం అందించారు. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ హైప్ కలిగిన జవాన్ మూవీ నేడు భారీ అంచనాలతో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ టాక్ ని సొంతం చేసుకుంది.
అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, జవాన్ మూవీ యొక్క సౌత్ డబ్బింగ్ వర్షన్ అలానే హిందీ వెర్షన్ లో కొంత వేరియేషన్ ని మనం గమనించవచ్చు. తెలుగు మరియు తమిళ్ డబ్బింగ్ వెర్షన్స్ లో కమెడియన్ యోగిబాబు సీన్స్ ఉండగా ఒరిజినల్ అయిన హిందీ వెర్షన్ లో మాత్రం ఆయన సీన్స్ లేవు. అయితే తెలుగు, తమిళ ఆడియన్స్ లో మరింత ఆసక్తిని ఏర్పరిచేందుకు ఆయన సీన్స్ ని ఏర్పాటు చేశారట మేకర్స్. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పై భారీ స్థాయిలో గౌరి ఖాన్ నిర్మించిన జవాన్ లో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించారు.