ఇంట్రెస్టింగ్..ఈ భాషలో డబ్ కానున్న “అఖండ”?

Published on Jan 27, 2022 9:00 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన హై బడ్జెట్ యాక్షన్ డ్రామా “అఖండ”. ఈ సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులు దాటినా కూడా ఈ సినిమా సెన్సేషన్ కొనసాగుతూనే ఉంది.

ముందు అయితే తెలుగు ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్రం రీసెంట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యాక హిందీ సహా మిగతా ముఖ్య భాషల ఆడియెన్స్ నుంచి కూడా మరింత సాలిడ్ రెస్పాన్స్ ను అందుకొని ఆశ్చర్యపరుస్తుంది. ఇదిలా ఉండగా ఇపుడు ఈ సినిమాపై ఓ క్రేజీ బజ్ వినిపిస్తుంది.

ఈ చిత్రం తమిళ్ భాషలో డబ్బింగ్ కానున్నట్టు తెలుస్తుంది. ఇంకా దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :