ఇంట్రెస్టింగ్..”పుష్ప” సినిమా కూడా పెద్దగానే..?

Published on Dec 9, 2021 10:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం వచ్చే వారంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదే ఈ సినిమా నిడివి పై. ఈ చిత్రాన్ని కూడా సుకుమార్ ఎక్కువ లెంగ్త్ లోనే కట్ చేశారట. తన సినిమాల్లో ఎప్పుడు లేని విధంగా ఈ చిత్రం మూడు గంటల నిడివి వచ్చేసినట్టు తెలుస్తుంది.

అయితే ఇందులో ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ మూడు గంటల పాటు అంటే సుకుమార్ రైటింగ్ తోనే మ్యాజిక్ చెయ్యాలి మరి వేచి చూడాలి ఏం జరుగుతుందో అనేది. ఇక ఈ భారీ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంతా చేసిన మాస్ ఐటెం సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతుండగా దేవిశ్రీ ప్రసాద్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ని అందించాడు.

సంబంధిత సమాచారం :