ఇంట్రెస్టింగ్..ఈ భాషల్లో కూడా “రాధే శ్యామ్” రిలీజ్.!

Published on Oct 24, 2021 10:06 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్” నుంచి నిన్ననే ప్రభాస్ బర్త్ డే కానుకగా ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్ ని చిత్ర యూనిట్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు. మరి దీనికి కనీ వినీ ఎరుగని స్థాయి రెస్పాన్స్ కూడా ఇప్పుడు వస్తుండగా ఓ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఈ సినిమాపై టీజర్ తోనే వచ్చింది.

ఈ సినిమాని మొదట పాన్ ఇండియన్ సినిమాగా ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. కానీ తర్వాత మళ్ళీ పరిస్థితులు రీత్యా రాధే శ్యామ్ ఇతర విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చెయ్యొచ్చనే ఊహ కూడా మేము పొందుపరిచాం. మరి ఇప్పుడు దానిని నిజం చేస్తూ ఈ సినిమాని మొదటి ఇండియన్ ఐదు భాషలతో పాటుగా చైనీస్ మరియు జాపనీస్ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

నిన్న రిలీజ్ చేసిన టీజర్ డీటెయిల్స్ లో చూస్తే ఇది అర్ధం అవుతుంది. ఎలాగో స్పిరిట్ ని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు కాబట్టి మొదటి అడుగుగా రాధే శ్యామ్ తోనే వేస్తారేమో అనే అంచనా నిజం చేసి చూపించారు మేకర్స్. సో ఇక ముందు కూడా ప్రభాస్ సినిమాలు ఇలానే రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More