ఇంట్రెస్టింగ్..”రాధే శ్యామ్” మొత్తం మూడు వెర్షన్స్ లో రిలీజ్ అవుతుందా?

Published on Feb 20, 2022 3:04 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ సినిమా “రాధే శ్యామ్” కూడా ఒకటి. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికే ట్రైలర్ చూసాక చాలా మందికి క్లారిటీ వచ్చింది.

అయితే ప్రభాస్ సినిమాలు “సాహో” నుంచి ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమాలుగా చేస్తున్నారని చెప్పాలి. తెలుగు, హిందీలో ఒకే సీన్ ని రెండు సార్లు తీయడం నుంచి ఇప్పుడు రాధే శ్యామ్ లో సెపరేట్ సెపరేట్ పాటలు చేసే వరకు వచ్చి క్లీన్ గా తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్లానింగ్ లో ఇంకా ఆసక్తికర అంశాలు ఉన్నట్టు అనిపిస్తుంది.

ఈ చిత్రం రిలీజ్ మొత్తం మూడు వెర్షన్స్ లో అవుతుందా అనే సందేహం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ తెలుగు మరియు హిందీ భాషల్లో వేరు వేరు నిడివి తో ఈ చిత్రం ఉంటుంది అని తెలిసిందే. కానీ ఇప్పుడు యూఎస్ వెర్షన్ విషయానికి వస్తే అక్కడ టికెట్ బుకింగ్స్ లో సినిమా నిడివి ఆసక్తిగా వైరల్ అవుతుంది.

అక్కడ ఈ సినిమాని కేవలం రెండు గంటల 8 నిమిషాలకి కుదించారట. అంటే సినిమాలో పాటలు అన్ని తీసేసి రిలీజ్ చేస్తున్నట్టే అనుకోవాలి. కాకపోతే ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. ఒకవేళ నిజం అయితే తెలుగు, హిందీ ఓవర్సీస్ లో మొత్తం మూడు వెర్షన్స్ లో సినిమా రిలీజ్ అవుతుందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :