ఇంట్రెస్టింగ్..చరణ్ స్వామితో శంకర్ సాలిడ్ ప్లాన్ నిజమేలా ఉంది.!

Published on Oct 17, 2021 11:01 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్వామి ప్రస్తుతం తన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాలు చేసేసి ఇప్పుడు తన సెన్సేషనల్ కాంబో శంకర్ తో సినిమాలో బిజీగా ఉన్నారు. తమ ఇద్దరి కాంబోలో ఇది బెంచ్ మార్క్ సినిమా కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే శంకర్ సినిమాల కోసం తెలుగు ఆడియెన్స్ కి అయినా కొత్తగా చెప్పనక్కర్లేదు.

తన సినిమా అంతా ఎంత గ్రాండియర్ గా ఉంటుందో ఒక నటునిలోని సంపూర్ణతని కూడా శంకర్ రాబట్టగలరు. అంతే కాకుండా డిఫరెంట్ షేడ్స్ లో కూడా తన హీరోలని చూపించి శంకర్ ఆశ్చర్యపరుస్తారు. మరి అలానే ఇప్పుడు శంకర్ సినిమాలో రామ్ చరణ్ స్వామిని కూడా డిఫరెంట్ లుక్స్ లో చూపిస్తున్నారని గత కొంత కాలం బజ్ వినిపించింది. మరి ఇప్పుడు ఇది నిజమే అనిపిస్తుంది.

ఎందుకంటే ఆల్రెడీ సినిమా చరణ్ మంచి స్టైలిష్ లుక్ లో గడ్డంతో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యింది పైగా కియారా తో సాంగ్ కూడా షూట్ అయ్యింది అని తెలిపింది. కానీ తాజాగా చరణ్ కొత్త లుక్ లో కనిపించారు. సో ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కాబట్టి డెఫినెట్ శంకర్ సినిమాలో మరో లుక్ అని చెప్పొచ్చు. మరి ఇది డ్యూయల్ రోలా లేక మరేమన్నానా అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :

More